తనపై జోకులు వేస్తే తేలికగా తీసుకునేది లేదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఘాటు సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో అత్యంత పాపులర్ కామెడీ టీవీ షో సాటర్డే నైట్ లైవ్ పై ట్రంప్ మండిపడ్డారు. ఈ కామెడీ షో పక్షపాతపూరితంగా, ఏకపక్షంగా ఉందని, ఇందులో ఏమాత్రం హాస్యం లేదని ట్రంప్ విమర్శించారు. అధ్యక్షుడితోపాటు ఇతర రాజకీయ నాయకులను ఎగతాళి చేస్తూ కామెడీ షోలు నిర్వహించడం అమెరికాలో చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే, తాను అధ్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఎకసెక్కాలు కుదరవని ట్రంప్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. సాటర్డే నైట్ లైవ్ షోలోని కొన్ని భాగాలను నేను చూశాను. ఇవి పూర్తిగా ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.